Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చైనా, పాక్‌ నిర్మాణాలపై పీవోకేలో నిర‌స‌న‌ ప్రదర్శనలు

protest against china pak in pok
  • ముజ‌ఫ‌రాబాద్ వాసుల ఆందోళన
  • నీలం, జీలం న‌దుల‌పై ఆన‌క‌ట్ట‌ల నిర్మాణం వద్దని వాదన
  • ప‌ర్యావ‌ర‌ణానికి కూడా నష్టం వాటిల్లుతుందని నిరసన 
  • ప్రాజెక్టులు ఆపే వ‌ర‌కు నిర‌స‌న‌లను కొనసాగిస్తామని హెచ్చరిక
చైనా, పాకిస్థాన్ ప్ర‌భుత్వాలు చేపట్టిన పలు ప్రాజెక్టులపై మండిపడుతూ పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్(పీవోకే)లోని ముజ‌ఫ‌రాబాద్ వాసులు ఆందోళనలకు దిగారు. నీలం, జీలం న‌దుల‌పై ఆన‌క‌ట్ట‌ల నిర్మాణాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. చైనా, పాక్ ఎకనామిక్ కారిడార్ కింద‌ నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టుల వల్ల ప‌ర్యావ‌ర‌ణానికి కూడా నష్టం వాటిల్లుతుందని వారు అంటున్నారు.

ఆయా న‌దుల‌పై నిర్మాణాల కోసం చైనా, పాకిస్థాన్‌ ఏ చ‌ట్టం కింద ఒప్పందం చేసుకున్నాయని వారు నిలదీస్తున్నారు. ఇరు దేశాలు ఆ ప్రాంతాల్లో అక్రమంగా కోహ్లా హైడ్రో ప‌వ‌ర్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయని, ఆ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపకపోతే వాటిని అడ్డుకుంటామ‌ని తేల్చిచెప్పారు.

ఆయా ప్రాజెక్టులు ఆపే వ‌ర‌కు తమ నిర‌స‌న‌లను కొనసాగిస్తూనే ఉంటామని తెలిపారు. కాగా, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని జీలం న‌దిపై హైడ్రో ప‌వ‌ర్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. ఈ 1,128 మెగావాట్ల జ‌లవిద్యుత్ ప్లాంట్‌ కోసం 92.9 బిలియ‌న్ డాలర్లు వెచ్చిస్తున్నారు.
China
Pakistan
pok

More Telugu News